Bichagadu 2 : సోషల్ మీడియాలో ‘బిచ్చగాడు 2’ హల్ చల్.. అసలేమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bichagadu 2 : విజయ్ ఆంటోని ఆరేళ్ల క్రితం నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో గుర్తుందా? 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అదే సంవత్సరం నోట్ల రద్దు జరగడం.. ఈ సినిమాలో బిచ్చగాడు.. 500, 1000 నోట్లను రద్దు చేయమని సూచించడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నోట్ల రద్దును బిచ్చగాడు ముందుగానే అంచనా వేశాడంటూ మీమ్స్ హల్చల్ చేశాయి. తల్లి ఆరోగ్యం కోసం కొడుకు బిచ్చగాడు మాదిరిగా దీక్ష చేపట్టే ఈ కథ ప్రేక్షకులకు హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాలని కోరుకున్నారు. ఇప్పటికే ఆ సినిమాను మొదలుపెట్టేశారు కూడా. తాజాగా బిచ్చగాడు-2 గురించి ఆసక్తికర అప్డేట్ చెప్పారు హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Read Also: RRR New Record: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉంటాడు. దానిపై యాంటీ బికిలీ(Anti Bikili) అని రాసి ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు విజయ్. బిచ్చగాడు 2 డిజిటల్, శాటిలైట్ హక్కులకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను స్టార్ నెట్‌వర్క్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్. సీక్వెల్ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీయే స్వయంగా డైరెక్ట్ చేస్తూ.. సంగీతమందిస్తుండటం విశేషం. కొన్ని నెలల క్రితం విడుదలైన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. బిచ్చగాడు 2లో హరీష్ పేరడి, కావ్య థాపర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=SZ53jYM41do&t=27s&ab_channel=MangoMusic
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!