Pakistan: అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన 9/11 ఉగ్రదాడిని తలపించేలా, ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) చేసిన సోషల్ మీడియా పోస్ట్ నవ్వులపాలైంది. పాకిస్తాన్ పరువు తీసింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని విమానాలు ఢీకొన్న తరహాలోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని ఢీకొనేందుకు వెళ్తున్నట్లుగా పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్‌ని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌ని ఏకిపారేశారు.