Business Headlines 03-03-23: తెలంగాణకి ఫాక్స్‌కాన్ సంస్థ: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయంగా పేరొందిన సంస్థల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. ఈ కంపెనీ తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని సర్కారు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌లో ఇండియాకి వచ్చిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్లలో ఇదొకటని తెలిపింది.