దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
హైదరాబాద్ ప్రపంచస్థాయి సంస్ధలకు వేదిక అవుతోంది. అనేక అగ్రగామి సాఫ్ట్ వేర్, ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా షామీర్‌పేట్ లోని TSIIC బయోటెక్ పార్క్ లో ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ను ప్రారంభించారు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్…