ఎన్టీఆర్ జిల్లా మొత్తం సెక్షన్ IPC 144, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.. అపోహలకు పోయి ఎలాంటి గొడవలకు దారి తీయొద్దు.. అనుమానాలుంటే పోలీసు నంబర్లకు కాల్ చేయచ్చు అని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్. ఆ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే చంపేయమని చెప్పింది.
సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Hyderabad Petrol Bunks: పెట్రోల్ బంకులు మూతపడతాయన్న వదంతులు మళ్లీ వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా..
హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిట్ అండ్ రన్' వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది.…
భారతదేశంలో తీవ్రమైన చలి కారణంగా ఇంధనానికి డిమాండ్ తగ్గింది. దీంతో డిసెంబర్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గినట్లు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల ప్రారంభ విక్రయాల డేటా నుండి ఈ సమాచారం అందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2023 డిసెంబర్‌లో 1.4 శాతం తగ్గి 27.2 లక్షల టన్నులకు చేరుకోగా, డీజిల్ డిమాండ్ 7.8 శాతం తగ్గి 67.3 లక్షల టన్నులకు చేరుకుంది.
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.