జూన్ 1 నుంచి మీ ఇంటి ఖర్చులకు సంబంధించిన నియమాలలో మార్పులు జరగనున్నాయి. ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో కంటే ఈసారి కూడా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్‌డేట్, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
READ MORE: PAN Aadhaar Link: పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్‌పై ఐటీ శాఖ కీలక సూచన.. లాస్ట్ డేట్ వెల్లడి..
పెట్రోల్, డీజిల్ సహా LPG సిలిండర్ల ధరలలో మార్పులు..
జూన్ 1న చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను నిర్ణయించనున్నాయి. మేలో కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించాయి. ఇప్పుడు జూన్‌లో కూడా కంపెనీలు మరోసారి సిలిండర్ ధరలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTO ని సందర్శించాల్సిన అవసరం లేదు..
కొత్త రవాణా నియమాలు (కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024) జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీని తరువాత, మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మీరు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సులభతరం అవుతుంది. ఆర్టీవో కార్యాలయాన్ని సందర్శించకుండానే లైసెన్స్ పొందొచ్చు.
ట్రాఫిక్ రూల్స్‌లో కూడా మార్పులు..
కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను కూడా కఠినతరం చేయనున్నారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతోపాటు మైనర్‌కి 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా చేస్తారు. ఇతర నిబంధనలను ఉల్లంఘించినందుకు కూడా జరిమానా విధిస్తారు. ఇందులో అతివేగం, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500, హెల్మెట్ ధరించకుంటే రూ.100, సీటు బెల్ట్ ధరించకుంటే రూ.100 జరిమానా విధిస్తారు.
జూన్ 14 వరకు ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ సౌకర్యం..
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకారం.. మీరు 10 సంవత్సరాలుగా మీ ఆధార్ కార్డ్ ని అప్‌డేట్ చేయకుంటే.. జూన్ 14 వరకు ఉచిత ఆధార్ అప్‌డేట్ కు అవకాశం ఉంటుంది. UIDAI పోర్టల్‌లో ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సదుపాయం ఉచితంగా అందిస్తుంది. జూన్ 14 తర్వాత అయితే నగదు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా ఈ పనిని చేయవచ్చు.
జూన్‌లో మొత్తం 12 రోజుల బ్యాంకు సెలవులు..
జూన్ నెలలో, బక్రీద్, వట్ సావిత్రి వ్రత్‌తో సహా వివిధ పండుగలు, వారపు సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేయబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. జూన్ లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.