వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో నాని ఏ6గా ఉన్నారు. ఈ ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బందరు మండలం పోట్లపాలెంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ…
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ పూర్తయింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధను 2 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో ఆమె సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. విచారణలో పోలీసులు 45 ప్రశ్నలు అడిగారు. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె చెప్పింది
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి పోలీసులు…
Ration Rice Case: మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి తేల్చారు. అయితే వేబ్రిడ్జి సరిగా పనిచేయడం లేదంటూ.. తప్పించుకునేందుకు వైసీపీ నేత పేర్ని నాని యత్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని…