త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుందని హరీష్ రావ్ అన్నారు. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఉచితాలు బీజేపీ బంద్ చేయమంటుందని, ఏది ఉచితం ఏది అనుచితం…
టీడీపీ నేతలపై ఒకరేంజ్‌లో ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరన్నారు. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబుకు సిగ్గుందా? చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోంది.…
మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్‌లను పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పెన్షన్ పెంపు పురుషులతో పాటు మహిళా మాజీ క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్‌ను రూ.30 వేలకు బీసీసీఐ పెంచింది. అంతేకాకుండా గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.70 వేలకు పెంచింది. ఆటగాళ్లకు కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. తమ పెన్షన్లు పెంచాలని ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్ (ICA) గత కొన్నాళ్లుగా…
ఏపీలో జూన్ 1 సందర్భంగా పెన్షన్‌ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం రూ.1,543.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పెన్షన్‌ల పంపిణీ వివరాలను అందజేశారు. Tulasireddy: దావోస్‌కి కాదు.. ఢిల్లీకి వెళ్ళి సాధించండి ఉదయం 7 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా వాలంటీర్లు సుమారు…
ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు నేరుగా అందేలా చేసే ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని మాత్రమే మహిళలకు మంజూరైన పది కోట్ల రూపాయల వడ్డీ రాయితీ చెక్కును మహిళలకు అందజేశారు. మహిళా లబ్ధిదారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన…
తెలంగాణ రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా మారింది. వరంగల్ బహిరంగ సభలో కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. నేను చెప్పేది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలి. నా మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా విసిరేస్తానన్నారు. కేంద్రానికి తెలంగాణ 3 లక్షల 65 వేల 797 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ కేంద్రం తిరిగి ఇచ్చింది కేవలం లక్ష 68 వేల…
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని…
ప్రభుత్వం అంటే సవాలక్ష ఖర్చులు ఉంటాయి.. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ప్రాజెక్టులు, ఇంకోవైపు జీతాలు, పెన్షన్లు.. అబ్బో ఒక్కటేంటి.. అదో పెద్ద మహాసముద్రమే.. అయితే, ఆర్థికంగా బాగా ఉన్న రాష్ట్రాలతో పాటు, పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవయమే ఎక్కువని తేల్చింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. ఉద్యోగుల జీతభత్యాలపై ఏపీ సర్కార్ కంటే.. మిగతా రాష్ట్రాలు తక్కువగా ఖర్చు చేస్తున్నాయని కాగ్ పేర్కొంది.. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను అంటే…