ఏపీలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం యుద్ధం చేస్తున్నాం అన్నారు సీఎం జగన్. జనవరి 1 నుంచి పెన్షన్లు రూ.2750 కి పెంచుతున్నాం అన్నారు. తాము చేసేది చెబుతాం, ప్రతిమాట నిలబెట్టుకుంటాం అన్నారు జగన్. ప్రతి నెల ఆరునెలలకు ఒకసారి ఆడిట్ చేస్తాం. వెరిఫికేషన్ కోసం నోటీసులు ఇస్తే.. ఎల్లో మీడియా అల్లకల్లోలం చేసింది. చంద్రబాబు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో తెలుసా. కేవలం 39 లక్షలు. జగనన్న పాలనలో 62 లక్షల 30 వేల పెన్షన్లు ఇస్తున్నాం. జనవరిలో ఇవి మరింత పెరుగుతాయన్నారు జగన్. పెన్షన్లు పెంచుతుంటే.. ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. పెన్షన్ల బిల్లు 17వందల కోట్లకు చేరింది. తేడా గమనించండి. ఒక్కటంటే మంచి పని చేశారా అని చంద్రబాబుని ప్రశ్నించారు. దత్త తండ్రిని నెత్తిన పెట్టుకుని ఓ దత్తపుత్రుడు తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రం కాకుంటే ఆ రాష్ట్రం, ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీతో, ఈ భార్య కాకుంటే ఆ భార్య అన్నట్టుగా ఈ స్టయిల్ వుంది. ఇవన్నీ చూస్తుంటే ఇదేం ఖర్మరా అని అనిపిస్తుంది. ఇదే రాజకీయం అనిపిస్తుంది.
Read Also: World leaders offer condolences: ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రపంచ నేతల సంతాపం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బలిఘట్టం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు పలికారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ధర్మశ్రీ అవంతి శ్రీనివాస్, కన్నబాబురాజు, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, పాల్గుణ, సీతం రాజు సుధాకర్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ.. దాడి వీరభద్రరావు, చింతకాయల జమీల్. బలిఘట్టం నుంచి జోగినాథపాలెం వరకు ర్యాలీగా బయలుదేరారు సీఎం.. అనంతరం రూ.1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. రోడ్డు షోలో భారీ ఎత్తున పాల్గొన్నారు ప్రజలు. రోడ్డుకు ఇరువైపులా నిలుచుని సీఎం జగన్‌కి పూలతో స్వాగతం పలికారు ప్రజలు. ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు.
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ అన్నారు. అంతకుముందు నర్సీపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించనున్నారు. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు.
Read Also: Cm Jagan Public Meeting At Narsipatnam Live: నర్సీపట్నంలో సీఎం జగన్ బహిరంగసభ