ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హతలుండాలి. అన్ని అర్హతలుండి కూడా ఠంచనుగా వస్తున్న పింఛన్ ఆగిపోతే వారి పరిస్థితి ఎలా వుంటుంది? కోర్టుల ద్వారా న్యాయం జరిగితే ఆ ఆనందానికి అవధులే వుండవు. తన పింఛను కోసం కోర్టుకెక్కిన ఓ వృద్ధురాలు విజయం సాధించింది. పింఛన్ వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఇవ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి…