బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్‌లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్ కనిపించబోతున్నాయట. ఆ సన్నివేశాలు నియోజకవర్గంలో పాజిటివ్ వైబ్స్ తీసుకు వస్తాయా? లేక నెగెటివిటీని పెంచుతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరడం ఖరారైపోయింది.
పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్ పులుముకుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డారు. ఈ సారి టికెట్ రాని అధికార పార్టీ నేతలు, టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న నాయకులు ఈ న్యూ ఇయర్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.