పెగాసస్ వివాదంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అస్త్రంగా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు అసెంబ్లీలో పెగాసస్ వివాదంపై చర్చ కూడా చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం…
పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే…
దేశ్యాప్తంగా చర్చగా మారి.. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ స్కామ్‌పై విచారణను మరోసారి వాయిదా వేసింది సుప్రీంకోర్టు… గత విచారణ తర్వాత ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం.. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై కలిసి విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన…
రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా.. న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరొక పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, సీపీఎం ఎంపీ జాన్…
పెగాసస్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ రగడ కుదిపేస్తోంది.. ప్రతిపక్షాల ఆందోళనతో సమావేశాలు వాయిదా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీనియర్ న్యాయమూర్తి మదన్ భీంరావ్ లోకూర్, కోల్‌కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యల నేతృత్వంలో హ్యాకింగ్, నిఘాలపై దర్యాప్తునకు ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అక్రమ హ్యాకింగ్, నిఘా, మొబైల్ ఫోన్ల…