రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా.. న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరొక పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ మరో పిటిషన్ వేశారు.. కాగా, పెగాసస్ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తును కోరుతూ వేసిన పిటిషన్ల పై వీలైతే వచ్చే వారం విచారణను చేపడతామని గత శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు.
విపక్ష రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర ప్రముఖులు లక్ష్యంగా ఇజ్రాయెల్ స్పైవేర్ ను ఉపయోగించి, వారి ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టారని వచ్చిన ఆరోపణలపై సిట్ట్ంగ్ జడ్జి లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ పాత్రికేయులు ఎన్. రామ్, శశికుమార్.. సత్వరమే విచారణ జరపాలని గత శుక్రవారం వాదనలు చేస్తూ కోరారు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుని వచ్చేవారం విచారణ జాబితాలో చేరుస్తామని, గత శుక్రవారం సూచించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ఆమేరకు, అన్ని పిటిషన్లను వచ్చే గురువారం విచారణ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. స్వేఛ్చ, స్వాతంత్ర్యాలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశం పై సత్వరమే విచారణ జరిపాలని కోరారు న్యాయవాది కపిల్ సిబల్.. నిఘా పెట్టేందుకు లక్ష్యంగా
రాహుల్ గాంధీతో సహా, దేశంలో 142 మందికి పైగానే ప్రముఖులను ఎంపికచేసుకున్నట్లుగా ప్రముఖ మీడియా సంస్ధల సంయుక్త పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొన్నారు పిటిషనర్లు.