Vijayawada-Hyderabad Highway: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలోని గొల్లగట్టుపై ప్రఖ్యాత పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతర ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్దగట్టు జాతరను ప్రధానంగా యాదవ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంది. అయితే, ఈ ఉత్సవానికి యాదవులతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి…
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర, ప్రారంభమై నేటికి రెండోరోజు. నిన్నటి నుంచి శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మల దర్శనార్థం భక్తుల రాక పెరుగుతూనే ఉంది.