CM Chandrababu: గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి నూతన భవనాన్ని, అందులోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రి ప్రాంగణాన్ని పూర్తిగా సందర్శించి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల గురించి, నూతనంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం యొక్క ప్రత్యేకతల గురించి…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్. హిందూ దేవతలను రాష్ట్రంలో అవమానిస్తున్నారు. అంతర్వేది రథదహనంతో ప్రారంభమై అనేక సంఘటనలు హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా? పెదకాకాని ఆలయంలో ముస్లిం వ్యక్తి మాంసం వండటం హైందవ మతాన్ని అవమానించడమే. ఇంత దారుణం జరుగుతుంటే.. పోలీసులు , అధికారులు చోద్యం చూస్తున్నారు. జిన్నా టవర్ పేరు చెప్పగానే…
గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటన కలకలం రేపింది. ఇది సున్నితమైన అంశం కావడం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయంలోని క్యాంటీన్ మూసివేసి, దాన్ని లీజుకు తీసుకున్న నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాంసాహారం బయటే వండారని, దానికి సంబంధించిన రిక్షా ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై గురువారమే నిర్వాహకులకు…
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి నుంచే అల్పాహారం, అన్నదానానికి భోజనం సరఫరా అవుతాయి. అదే క్యాంటీన్‌లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీసింది. ఇటీవల ఓ వ్యక్తి వేలంపాటలో క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నాడు. అతడి దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త లీజుకుని తీసుకుని ఇప్పుడు ఈ క్యాంటీన్‌ను నడుపుతున్నట్లు…