తమిళ స్టార్ నటుడు, డీఎండీకే చీఫ్ ,కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తనను ఎంతో బాధించిందని తలైవా రజనీకాంత్ తెలిపారు.శుక్రవారం ఉదయం చెన్నైలోని అన్నాసాలైలోగల ఐలాండ్ మైదానం లో కెప్టెన్‌కు రజినీ నివాళులర్పించారు. అనంతరం ఆయన విజయకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. విజయకాంత్ మంచి మనసున్న వ్యక్తి.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.. ‘నా ప్రియ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. విజయకాంత్ ఆరోగ్య సమస్యల నుంచి…