Rajinikanth : విజయకాంత్ బ్రతికిఉండి ఉంటే తమిళ రాజకీయాలలో ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ నటుడు, డీఎండీకే చీఫ్ ,కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తనను ఎంతో బాధించిందని తలైవా రజనీకాంత్ తెలిపారు.శుక్రవారం ఉదయం చెన్నైలోని అన్నాసాలైలోగల ఐలాండ్ మైదానం లో కెప్టెన్‌కు రజినీ నివాళులర్పించారు. అనంతరం ఆయన విజయకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. విజయకాంత్ మంచి మనసున్న వ్యక్తి.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.. ‘నా ప్రియ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. విజయకాంత్ ఆరోగ్య సమస్యల నుంచి త్వరలోనే కోలుకుంటారని తాము అంతా అనుకున్నాం. అయితే ఇటీవలే డీఎండీకే మీటింగ్‌లో ఆయన్ని చూడగానే నాలో వున్న ఆ కాస్త ఆశ పోయింది. ఆయన బతికి ఉండి ఉంటే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకం గా వ్యవహరించేవారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసేవారు. విజయకాంత్ లాంటి మంచి మనసున్న వ్యక్తి మనకు ఎప్పటికి దొరకడు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అంటూ రజినీ తన సంతాపం వ్యక్తం చేసారు.
కాగా విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతోబాధపడుతున్నారు. గత నెల 18న కూడా జలుబు, దగ్గు,గొంతునొప్పి వంటి సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. చికిత్స తరువాత కోలుకుని డిసెంబర్ 11 న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలైనా గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో చెన్నై లోని ఆసుపత్రి లో చేర్పించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నై లోని అన్నాసాలై లోగల ఐలాండ్ మైదానం లో ఉంచారు. శుక్రవారం సాయంత్రం 4:45 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమం లో విజయకాంత్ ను కడసారి చూసేందుకు సినీ మరియు రాజకీయ ప్రముఖులు అలాగే ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు వేలాది మంది తరలివస్తున్నారు.
Also Read
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
- Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
తాజావార్తలు
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!