Pawan Kalyan: అభిమానం.. అది ఒక్కసారి మనసులో చేరితే ఎక్కడ వరకు అయినా తీసుకెళ్తోంది. చివరికి అభిమానించిన వ్యక్తి చెప్పినా కూడా వారి పిచ్చిని ఆపడం కష్టం. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అది అభిమానం కాదు భక్తి. వారు అభిమానులు కాదు భక్తులు అని చెప్పొచ్చు.