Pawan Kalyan : ఏపీ రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మరించారు. వారి త్యాగం ఎన్నటికీ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించి ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ ఉన్నతాధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ (IFS) ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. Abhinay:…
Pawan Kaalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని ముసలి మడుగు ప్రాంతంలో నిర్వహించిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని, తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రిని దగ్గరగా చూడడానికి భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక మహిళ కిందపడింది. సరిగ్గా అదే సమయంలో కదలడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈవెంట్లలో అభిమానుల జోష్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన పేరు విన్నా హాల్ కుదరదు, ఆ హంగామా చూస్తే ఎవరికైనా షాక్ వస్తుంది. తాజాగా యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్నే గుర్తు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు తాను శిల్పకలా వేదికలో రెండు సార్లు కిటికీలోంచి దూకి బయటకు వచ్చేశానని యాంకర్ సుమ తెలిపింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు…
సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..? బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా…
తిరుపతి పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతం, మంగళంలోని ఎర్రచందనం గోదాము పరిశీలించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వన సంపదపై కొనసాగుతున్న అక్రమాలను అరికట్టడానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైనా తన తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ మాటల్లో ప్రేమ, గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి. మనకు తెలిసిందే కదా.. పవన్ కల్యాణ్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు ఉన్నంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ బహుషా ఇంకెవరికీ ఉండరేమో. అయితే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటనే ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌ను…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల…
బాబాయ్-అబ్బాయ్ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి రాబోతున్నారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇప్పటికే జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ మాస్ లుక్ కేక పెట్టించేలా ఉంది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పెద్ది సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు.…
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు వెలిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొదటిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. 17 కుటుంబాలు నివసించే గూడెంకి 9.6 కి.మీ పొడవున 217 విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున 5 బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు. సుమారు రూ.80 లక్షల వ్యయంతో పర్వత అడవి ప్రాంతంలో…
తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, జిల్లా అటవీశాఖ అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా నదిపై హై లెవెల్…