2023లో అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2023లోనే వరుణ్ తేజ్ సరసన ‘గాండీవధారి అర్జున’లో నటించారు. ఈ రెండు సినిమాలు దారుణ పరాజయాలను చవిచూశాయి. అయితే సాక్షి గ్లామర్ మాత్రం తెలుగు యువ హృదయాలను ఆకట్టుకుంది. అయినా రెండేళ్లు ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ఎట్టకేలకు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాక్షి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆఫర్ గురించి స్పందించారు. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. అనుకోని కారణాలతో తప్పుకున్నా అని స్పష్టం చేశారు.
Also Read: The Raja Saab Runtime: అఫీషియల్.. ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ ఎంతంటే?
‘తెలుగులో నేను నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే నన్ను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి తీసేశారని వార్తలు వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. పవన్ కళ్యాణ్ సర్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. కీలక పాత్రలో నేను నటించాల్సింది. అదే సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో మూవీ టీమ్ నుంచి ఫోన్ వచ్చింది. రేపటి నుంచి షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో నేను షూటింగ్‌కు వెళ్లలేకపోయా. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఉస్తాద్ నుంచి తప్పుకున్నా. నాపై మరోలా రూమర్స్ వచ్చాయి. అలాంటివి నేను పెద్దగా పట్టించుకోను’ అని సాక్షి వైద్య చెప్పారు. సాక్షి నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా జనవరి 14న విడుదల కానుంది.