పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ భక్తులకు అదో పెద్ద పండుగ. ఆ రోజును మెగా అభిమానులు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. తమ అభిమాన నటుడు పుట్టిన రోజు సందర్భంగా సామాజిక కార్యకలాపాలతో పాటు సేవ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పవన్ అభిమానులు ఖుషి చేసే మరో వార్తను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. పవర్ స్టార్ సంచలన బ్లాక్ బస్టర్ మూవీ “గబ్బర్ సింగ్” మరోసారి వెండితెరపై ప్రదర్శితం కాబోతోంది. సెప్టెంబర్ 2న ఏకంగా 100 షోలను ప్లాన్ చేస్తూ పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకల ఉత్సాహాన్ని రెట్టింపు చేయనున్నారు.
Read Also : “శ్రీదేవి సోడా సెంటర్”పై మహేష్ ప్రశంసల వర్షం
ఈ విషయాన్ని పవన్ భక్తుడు బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ “సెప్టెంబర్ 2న బాస్ పుట్టిన రోజును స్పెషల్ గా తెలుగు రాష్ట్రాల్లో గబ్బర్ సింగ్ 100 స్పెషల్ షోల ద్వారా సెలెబ్రేట్ చేసుకుంటాం.. మా దేవుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును స్పెషల్ గా థియేటర్లో జరుపుకుంటాం జై పవర్ స్టార్ జై దేవర” అంటూ పవన్ అభిమానుల్లో జోష్ పెంచేశారు. బండ్ల ఈ వార్త ప్రకటించిన వెంటనే పవర్ స్టార్ అభిమానులు తమ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోల కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. బండ్ల గణేష్ కూడా చాలావరకు అభిమానులకు రిప్లై ఇస్తున్నారు. “గబ్బర్ సింగ్” విడుదలై దాదాపు దశాబ్దం పూర్తయినప్పటికీ పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో ఈ సినిమాని వీక్షించడానికి థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడానికి, థియేటర్ల వద్ద మునుపటి సందడి కనిపించడానికి ఈ సినిమా దోహదం చేయొచ్చు. వాస్తవానికి ఇది టాలీవుడ్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ హిట్ మూవీని రూపొందించిన విషయం తెలిసిందే.