పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత “వకీల్ సాబ్”తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన “భీమ్లా నాయక్” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్, రానా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని ప్రకటించేశారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ మధ్యలోనే ఆపేసిన క్రిష్ మూవీ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో చిత్రం రూపొందనుంది.
Read Also : తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది
దశాబ్దం క్రితం విడుదలైన బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్” తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబో రెండవసారి రిపీట్ కాబోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు తాజా సంచలన వార్త ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ ను పవన్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘సంచారి’, ‘ఇప్పుడే మొదలైంది’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఆ సస్పెన్స్‌కు ముగింపు పలకడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్ ఏంటో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి ఉండాల్సిందే.