జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు.
పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను సీఎం జగన్ ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారు అని మంత్రి రోజా ఆరోపించారు. వైజాగ్ ను క్రైం సీటిగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు.. రిషికోండకు బోడిగుండు కోట్టించారంటూ బోడి యదవలందరూ బోడి ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. దూరం నుంచే కొండను పరిశీలించిన పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, రుషికొండ నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసారు. తట్టెడు మట్టి తీస్తేనే పర్యావరణ ఇబ్బందులు వచ్చే చోట విధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అయితే సర్క్యూట్ హౌస్, ఇతర చోట్ల కట్టవొచ్చు కదా అని జనసేనాని ప్రశ్నించారు.
మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ఏమీ పీకలేరని విమర్శించారు. పవన్ కల్యాణ్కు సత్తా ఉంటే సింగిల్గా రావాలి అని వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్ లపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో నోవాటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.