2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం పొలిటికల్గా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టార్గెట్గా ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంగా నెక్స్ట్ ఇయర్ పవన్కు ఎంతో కీలకంగా మారనుంది. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూడబోతున్నాం. ఇప్పటికే పవర్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా బ్రో ది అవతార్.విలక్షణ నటుడు సముద్ర ఖని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 28 న విడుదల అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ లో కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్.. హీరోయిన్లుగా నటించారు..బాలీవుడ్ హాట్…