Renu Desai Fires on Meme Pages: రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొంత కాలం క్రితం తన మాజీ భర్త పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఉండడంతో ఆమెను క్రాప్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు క్రాప్ చేసి షేర్ చేయడానికి అవకాశం లేకుండా పవన్ పక్కనే అన్నా లెజినోవా నిలబడ్డారు. దీంతో ఇప్పుడు ఎలా క్రాప్ చేస్తుందో కొన్ని మీమ్ పేజెస్ రేణు దేశాయ్ మీద మీమ్స్ వేసాయంట. ఈ విషయం మీద ఫైర్ అయ్యారు రేణు దేశాయ్. ఇలాంటి విషయాల మీద కూడా కామెడీ చేస్తారా? మీకు కుటుంబాలు లేవా అని ఆమె ప్రశ్నించారు.
Puneeth Rajkumar: పునీత్ ఆత్మతో మాట్లాడిన స్వామీజీ.. కుమార్తె కడుపున పుడతానంటూ!
నా కూతురు ఈ ఉదయం చాలా ఏడ్చింది. తన తల్లి గురించి ఒక దరిద్రపు మీమ్ పేజీలో చూసిన మీమ్ ని ఆమె జీర్ణించుకో లేక పోయింది. మీరందరూ కూడా సెలబ్రిటీలు, పొలిటిషియన్స్ ఫ్యామిలీ ల గురించి ఇంత కామెడీ చేస్తారా? మీకు కూడా తల్లులు చెల్లెలు కూతుళ్లు ఇళ్లల్లో ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు సోషల్ మీడియా అందుబాటులో ఉంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఏడిపించే పని పెట్టుకుంటారా? అయితే గుర్తుపెట్టుకోండి నా కూతురు పడిన బాధ ఆమె కన్నీళ్లు మీకు ఎంత అనర్ధాన్ని తెస్తాయో. మీమ్ పేజెస్ నడిపే వాళ్ళందరూ దారుణమైన మనుషులు ఒక తల్లిగా నా శాపాన్ని మీరు తట్టుకోవాల్సిందే. ఇది పోస్ట్ చేయడానికి ముందు కూడా 100 సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు పడిన బాధని మీ అందరికీ తెలియాలని పోస్ట్ చేస్తున్నాను అంటూ ఆమె షేర్ చేసింది.