నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్ చౌటుప్పల్ సమీపంలోని లక్కారం, కోదాడకు వెళ్లనున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేయనున్నారు పవన్ కల్యాణ్. హైదరాబాద్ నుంచి బయలుదేరి ముందుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం చేరుకుని.. కొంగర సైదులు కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ కలుసుకుంటారు. అక్కడ…