Sugali Preeti’s Mother: కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆందోళనకు దిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈ సందర్భంగా ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారు అని ప్రశ్నించింది.
RK Roja: పవన్ కల్యాణ్‌కి రైతు సమస్యలు మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్ ల కోసం, బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామని ఆలోచన తప్ప... ప్రజా సమస్యల పట్టవని విమర్శించారు.. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించరన్నారు... పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు చేసుకుంటే... రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈసారి పవన్ కల్యాణ్…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మాజీమంత్రి రోజాకు లేదు అని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా నటుడుగానే విమానాల్లోనే తిరిగారు.. ఇప్పుడు మంత్రిగా విమానాల్లో తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించారు.
విజయనగరం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుకోలేదని.. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తోందన్నారు..
ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం…