భీమవరంలో నిన్న ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాకపోవటంపై ఏపీలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ స్పందించారు. పవన్ కళ్యాణ్ మొన్న ఇచ్చిన వీడియో సందేశమే ఆయనపై వస్తున్న విమర్శలకు సమాధానమని చెప్పారు. జనసేన శ్రేణులు ప్రధానమంత్రి సభను జయప్రదం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటాన్ని సోము వీర్రాజు గుర్తు…