Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత సమయంలో బీహార్‌కు చెందిన ఓ జావాన్ అమరవీరుడయ్యారు. ఆ అమరవీరుడికి వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయ్యింది. ఈ వార్త విన్న భార్య షాక్‌కి గురైంది. ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భార్యను ఒంటరిగా వదిలేశాడు. వాస్తవానికి తమది ప్రేమ వివాహమని ఆ సైనికుడు రాంబాబు భార్య అంజలి తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం 8 సంవత్సరాలుగా కొనసాగిందని.. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి…
India Pak War : ఖంగున మోగే బాణాసంచా వెలుగులు, బంధుమిత్రుల సందడితో కళకళలాడుతున్న పెళ్లింట ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. గురువారం రాత్రి రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌అవుట్ కారణంగా జోధ్‌పుర్‌లోని పావ్టా ప్రాంతంలో జరుగుతున్న ఆ వేడుకలో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వధూవరులు సప్తపది వేసే శుభఘడియకు సరిగ్గా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే, ఆటంకం ఎదురైనా ఆనందానికి అడ్డుకట్ట పడలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా తమ సెల్‌ఫోన్ల టార్చ్‌లైట్లు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా…
పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 15, జనవరి 26వ తేదీ వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దేశభక్తి పొంగిపొరలుతుంది. సోషల్ మీడియాలో దేశభక్తి వెల్లువలా మెసేజ్ లు, స్టాటస్ ల రూపంలో కనిపిస్తుంది. కానీ నిత్యం తమలోని దేశభక్తిని చాటుకుంటూ తమ విలక్షణతను అందరికీ తెలియచేస్తున్నారు కొందరు దేశభక్తులు. ఇలాంటి అరుదైన ఘటన నిత్యం ఒక జిల్లాలో కనిపిస్తుంది. అది కూడా తెలంగాణలోనే వుండడం గమనార్హం. తెలంగాణకు మకుటాయమానంగా మారిన ఆ జిల్లా వేరే ఏదీ కాదు. పోరాటాల ఖిల్లా.. నల్లగొండ…
యువత రాణిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు వెస్ట్ బెంగాల్ డీజీపీ BN రమేష్. విశాఖలో పర్యటిస్తున్న రమేష్ నగరంలో పలు విద్యా సంస్థలను సందర్శించి విద్యార్ధులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల్లో దేశ భక్తి పెంపొందింప చేసేలా ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యువత, విద్యార్థులు దేశానికి వెన్నెముక వంటి వారన్నారు రమేష్. విద్యార్థి దశ చాలా కీలకం అన్నారు. ప్రతీ ఒక్కరు దేశ సేవలో పాల్గొనాలని, దేశరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. దేశ…