కోనసీమ జిల్లాలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ జరిగాయి.దాదాపు 14 రోజుల తర్వాత పూర్తిగా బయట ప్రపంచం వారితో సంబంధాలు మొదలయ్యాయి. కోనసీమలో జరిగిన అల్లర్లతో జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రెండు వారాలుగా జిల్లావాసులు పడ్డ కష్టాలు తొలగిపోనున్నాయి. గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొద్దని నిరసనకారులు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. దాంతో అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపి…