ఏపీలో ఇంకా ఎన్నికలు రాకుండానే కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాము పార్టీ మారతాం అన్న ప్రచారంపై బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి సుచరిత భర్త దయాసాగర్.. నేను కేంద్ర సర్వీసులో ఉన్నతాధికారిగా పని చేశాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో అత్యంత అనుబంధం కలిగిన కుటుంబం మాది. మాకు జగన్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని శంకించవద్దన్నారు. నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను ,ఇక్కడి నుంచి పోటీ చేస్తాను అని ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: వారంరోజులుగా చంద్రబాబు డ్రామాలు ప్రజలు గమనించాలి
రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు. నేను రాజకీయాలకు వస్తే అందరికీ చెప్పే వస్తాను… మా కుటుంబంలో పార్టీ మారతారు అనే ప్రశ్న ఉత్పన్నం అవడానికి ఆస్కారం లేదు.. నిరాధారమైన ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం మా కుటుంబానికి లేదు. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు సుచరిత భర్త దయాసాగర్. అంతకుముందు మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా మా మనుగడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అని స్పష్టం చేశారు.
అయితే, నేను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారన్నారు.. అయితే, అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా? అందుకే.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తానని చెప్పుకొచ్చారు.. ఇక, నా భర్త ఒక పార్టీలో.. నేను మరొక పార్టీలో.. మా పిల్లలు ఇంకో పార్టీలో ఉండరని స్పష్టం చేశారు.. భర్త దయాసాగర్ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడారు. రాజకీయ నేతల మాటలకు అర్థాలే వేరు మరి. ఏం జరుగుతుందో చూడాలి మరి. \
Read Also: Minister Appala Raju: పవన్ మాట్లాడే ప్రతి మాటకు ఒక రేటు