Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ మహువా మోయిత్రా ఈ రోజు పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం రసాభాసగా మారినట్లు తెలుస్తోంది. మోయిత్రాకు అండగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్యానెల్ తప్పుడు ప్రశ్నలు అడుగుతోందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు మహువా మోయిత్రా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్…