పెగాసస్ స్పైవైర్‌పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్‌సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే…
పార్లమెంట్ సమావేశాలకు ముందు పెగాసస్ అంశం దేశాన్ని అతలాకుతలం చేసింది. పెగాసస్ స్పేవేర్‌తో దేశంలోని ప్రముఖులపై కేంద్రం నిఘా ఉంచిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించాలని పట్టుబడుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది. పెగాసస్ అంశం చర్చకు తీసుకురాకుండా మిగతా అంశాలను చర్చించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది. Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ కానీ, అందుకు ప్రతిపక్షాలు…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దని కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే కార్మికులు ప్రకటించారు. ఇందులో భాగంగానే విశాఖలో ర్యాలీలు, నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాజ్యసభలో ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈరోజు కూడా పార్లమెంట్‌లో మరోసారి స్పష్టంగా…
పార్లమెంట్‌లో రైతు చట్టాలపై వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను బ్యాన్ చేయాలని ఇప్పటికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడిని మొదట ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది.…
పార్లమెంట్‌లో దేశంలోని సమస్యల గురించి నేతలు సీరియస్‌గా చర్చ చేస్తున్నారు. చర్చిస్తున్న సమస్యలపై స్పీకర్ మాట్లడుతున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి సభలోకి ప్రవేశంచింది. దానిని చూసి స్పీకర్ షాక్ కావడమే కాకుండా గట్టిగా నోటిని మూసేకున్నారు. అంతలో సభలో కలకలం రేగింది. నేతులు అటూ ఇటూ పరుగులు తీశారు. వీరిని అంతలా పరుగులు పెట్టించిన అతిధి ఎదో కాదు… చిన్న ఎలుక. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. పార్లమెంట్ భవనంలోకి వచ్చేసింది. …