పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలను కేంద్రం ఇప్పటికే అభ్యర్ధించింది. అయితే, పెగాసస్, పెట్రోల్ ధరలు, కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. బిల్లుల విషయంలో సమగ్రమైన చర్చలు జరగాలని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. చర్చలు జరపకుండానే బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని నేతలు ఆందోళన చేస్తున్నారు. మరో వారం రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో, ఈ వారం రోజులపాటు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం నేడు ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టకూడదని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చే ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
Read: ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు మోసం చేసింది…