రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రేపటి (జూలై 21) నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు “పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు” సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలకు శెలవు. మొత్తం ఏడు పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. కొత్తగా గౌహతిలో ఐఐఎమ్ ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు…
Vijaya Sai Reddy: రాజ్యసభలో మంగళవారం నాడు కీలక చర్చ నడించింది. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్),…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలను ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొనడం తెలిసిందే. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు…