Parliament Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన నిందితులకు మరో 15 రోజుల పాటు అంటే జనవరి 5 వరకు పోలీస్ కస్టడీ పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. స్పెషల్ జడ్జ్ హర్దీప్ కౌర్ నిందితులు కస్టడీని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం దేవీల కస్టడీని పెంచాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు మరో 15 రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు.