పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభవార్త వెలువడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు.. ఈ ఈవెంట్‌లో భారత పురుషుల ఆటగాళ్లు క్వాలిఫయర్‌లకు మించి పురోగతి సాధించలేదు.
మహిళలు.. ఇంటికే పరిమితం కాదని మరోసారి నిరూపితమైంది. ఓ మహిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ.. ఎమ్మెల్యేగా గెలుపొందింది. అంతే కాదు.. ఆమె క్రీడాకారిణి కూడా.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్‌లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. భారత్‌లోని ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం.. వారందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాసుకొచ్చారు.
Zheng Haohao is Youngest Olympian in Paris 2024: విశ్వ క్రీడలకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పారిస్ ‘ఒలింపిక్స్’ అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. పారిస్‌లో ప్రవహించే సీన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 11 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం విశేషం. పారిస్…
ఒలింపిక్స్ కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రారంభోత్సవం వేడుకల వంతు వచ్చింది. 33వ ఒలింపిక్ క్రీడలను చిరస్మరణీయం చేసేందుకు ఫ్రాన్స్ పూర్తి సన్నాహాలు చేసింది.
పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ 2024 ప్రారంభం అయ్యాయి. జులై 25న ఒలింపిక్ క్రీడలు మొదలు కాగా.. మరునాడు గేమ్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
PV Sindhu about Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. తానేంతో మెరుగయ్యానని, తన ఆటను కోర్టులో చూస్తారని సింధు పేర్కొన్నారు. 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్య పతకాలను సింధు సాధించిన విషయం తెగెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి.. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రికార్డు సృష్టించాలని…
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భకత్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.