France: అల్లరిమూకలు ఫ్రాన్స్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పారిస్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి విద్రోహులు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఈ హింస ఫైబర్, మొబైల్ నెట్వర్క్, ల్యాండ్‌లైన్ సర్వీసుల్ని తాకింది.
Paris Olympics 2024: భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్‌లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్ ఆటను మొదలు పెట్టింది. సింగిల్స్ లో సుమిత్ నాగల్, డబుల్స్‌లో బోపన్న – బాలాజీ జోడీ రంగంలోకి దిగింది. ఈ రెండింటిలోనూ భారత్ ప్రయాణం తొలి రౌండ్‌లోనే ముగిసింది. నాగల్…
పారిస్ ఒలింపిక్స్‌లో రెండవ రోజు ఆదివారం (జులై 28) భారతదేశం పతక ఖాతా తెరిచింది. షూటింగ్‌లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతక ఖాతా తెరిచింది. షూటింగ్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.
భారత బాక్సర్ ప్రీతీ పవార్ వియత్నాంకు చెందిన వో థి కిమ్ అన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ మహిళల 54 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 5-0తో గెలిచి బాక్సింగ్‌లో భారత్ ప్రచారానికి శుభారంభం ఇచ్చింది.
పారిస్ వేదికగా ఒలింపిక్స్-2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ ఆరంభరోజు భారత్‌కు చెందిన అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ షూటర్ మనుబాకర్ మాత్రం అదరగొట్టింది. 2020 ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ పడి ఈవెంట్‌లోనూ ఫైనల్ చేరకుండా నిరాశపరిచిన మనుబాకర్.. ఈ సారి అంచనాలను అందుకుంటూ పోటీ పడ్డ తొలి ఈవెంట్‌లోనే ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది.
పారిస్‌లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది.