నూతన పరకామణి మండపంలో శ్రీవారి కానుకల లెక్కింపు సులభతరంగా మారింది.ఎప్పటికప్పుడు స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు లేక్కింపులు చెపడుతుండగా….విశాలమైన ప్రదేశం అందుభాటులోకి రావడంతో….సిబ్బందికి ఆరోగ్యపరమైన సమస్యలు తల్లేత్తకూండా ….మంచి వాతావారణంలో కానుకల లెక్కింపులు చేపట్టే అవకాశం లభించింది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు.కోరిన వారి కోర్కేలు తీర్చే కోంగుబంగారు దేవుడైన శ్రీవారికి తమ మ్రోక్కులు చెల్లింపులో భాగంగా కానుకలు సమర్పిస్తారు భక్తులు.ఇలా శ్రీవారికి లభించే కానుకలు ఎంతో ఘనంగా వుంటాయి.ఎటా స్వామివారికి లభించే హుండి కానుకులు 1500 కోట్లకు చేరుకుంటే….బంగారు వెయ్యి కేజిల వరకు వుంటుంది….ఇక వెండి కానుకలు మూడు వేల కేజిల పైమాటే….విటితో పాటు విలువైన వజ్రవైఢూర్యాలు కూడా స్వామివారి హుండీలో కానుకలుగా సమర్పిస్తారు భక్తులు. వీటి బరువు కూడా ఏడాదికి 20 కేజీల వరకు వుంటుంది. ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపులును గతంలో ఆలయంలోనే నిర్వహించేవారు.
Read Also: Karimnagar Crime: జమ్మికుంటలో విషాదం.. అన్న తమ్ముల పిల్లలు ఒకేరోజు ఆత్మహత్య
ఆలయంలో వున్న స్థలం కొరత కారణం ఒక్కటైతే…రెండవది భధ్రతా కారణాలు వలన క్లోజ్డ్ సర్క్యూట్ లో లెక్కింపులు నిర్వహించవలసి వుండడంతో సిబ్బందికి కష్టతరంగా వుండేది. హుండీ కానుకలలో దుమ్ము,ధూళీ ఎక్కువగా వుండడం….తక్కువ స్థలం ఎక్కువ మంది సిబ్బంది లెక్కింపు విధులలో వుండడం….క్లోజ్డ్ సర్క్యూట్ కావడంతో సిబ్బందికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేవి. ఒక దశలో పరకామణిలో విధులు నిర్వహించడానికి టిటిడి సిబ్బంది ముందుకు వచ్చేవారు కాదు. రోజు ప్రాతిపాదికన డిప్యూటేషన్ విధానంలో సిబ్బందిని నియమించేవారు. అయినా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూండడంతో ….పరకామణి విధులుకు టిటిడి సిబ్బంది డుమ్మా కొట్టేవాళ్ళు. దీంతో టిటిడి కొద్ది రోజులు బ్యాంకుల సహకారంతో….అటు తరువాత శ్రీవారి సేవకుల సహకారంతో పరకామణి లెక్కింపులు నిర్వర్తించవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికి దీనికి శాశ్వత పరిష్కారం చెయ్యాలని భావించిన ఇఓ ధర్మారెడ్డి….పరకామణి మండపానికి నూతన హంగులు ….ఆలయం ఎదుట సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలని భావించారు.
శ్రీవారి ఆలయం ఎదుట సువిశాలమైన ప్రాంతంలో బెంగళురుకి చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో 23 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మించింది టిటిడి. సెల్లార్ లో లాకర్లు ఏర్పాటు…గ్రౌండ్ ఫ్లోర్ లో నాణేల లెక్కింపునకు …మెదటి అంతస్థులో నోట్ల లెక్కింపులు చేసేలా ఏర్పాటు చేసారు. సువిశాలమైన ప్రాంతంలో సెంట్రలైజ్డ్ ఏసి సౌకర్యంతో నూతన పరకామణి మండపంలో లెక్కింపులు నిర్వహించడం సిబ్బందికి సులభతరంగా మారడంతో….వారు రెట్టించిన ఉత్సాహంతో లెక్కింపులు నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా నూతన మండపంలో లెక్కింపులు చేపడుతున్నారు. దీంతో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సువిశాలమైన ప్రాంతం కావడంతో…లెక్కింపులు కూడా వేగవంతంగా సాగుతూతు వుండగా…ఏరోజుకు సంబంధించిన కానుకలు ఆ రోజే లెక్కిస్తున్నారు.ఇక శ్రీవారి ఆలయం నుంచి హుండీ తరలింపు కూడా టిటిడి సులభతరంగా నిర్వహిస్తూండడంతో….మొత్తంగా నూతన పరకామణి మండపం అందుభాటులోకి రావడంతో….టిటిడికి శాశ్వత ప్రాతిపాదికన పరిష్కారం లభించినట్లైంది.
Read Also: Companies Names-Full Forms: మనకు తెలియని 40 ఆసక్తికరమైన అంశాలు