Pannun Murder Plot: పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగంతో నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని చెక్ రిపబ్లిక్‌లో అరెస్ట్ చేశారు.
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అమెరికా, భారత దర్యాప్తు కోసం ఎదురుచూస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ సోమవారం అన్నారు.
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ చేసింది. అమెరికా అధికారుల సూచన మేరకు గతేడాది నవంబర్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే నిందితుడికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా గడ్డపై అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడాన్ని అమెరికా…
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో అమెరికా సూచనల మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ గుప్తా ప్రేగ్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో భారత్‌కి ఎలాంటి అధికార పరిధి లేదని చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తేల్చి చెప్పింది.
PM Modi: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా న్యాయశాఖ అభియోగాలను మోపింది. నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్రకు పాల్పడినట్లు, అతనికి భారత ప్రభుత్వం ఉద్యోగి సహకరించినట్లు ఆరోపిస్తోంది. అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ దేశం నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేసింది. అతడిని తమకు అప్పగించాలని యూఎస్ కోరుతోంది. ఇదిలా ఉంటే ఈ పన్నూ వ్యవహారంలో భారత్-యూఎస్ రెండూ కూడా ఉన్నత స్థాయిలో చర్చించుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో…
భారత-అమెరికన్ చట్టసభ సభ్యులు అమీ బెరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీ తానేదార్ ఒక సంయుక్త ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎస్ న్యాయశాఖ అభియోగ పత్రాల్లో నిఖిల్ గుప్తాపై సంచలన అభియోగాలు మోపింది. ఈ ఆరోపణకు సంబంధించి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన విడుదలైంది.