మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే ఖండించారు. రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.