హైదరాబాద్ పంజాగుట్టలో మృతి చెందిన చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో చంపిన కసాయి తల్లి హైదరాబాద్‌కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. Read Also:…
పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. చిన్నారి కడుపులో బలంగా తన్నడం వల్లే మృతిచెందిందంటున్నారు వైద్యులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు చిన్నారి కడుపులో బలంగా తన్నినట్టు పోలీసులకు అందిన గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక అందడంతో హత్య కేసు గా నమోదు…