Panduranga Mahatyam: ఎన్టీ రామారావును మహానటునిగా తీర్చిదిద్దిన చిత్రాలలో ‘పాండురంగ మహాత్మ్యం’ స్థానం ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి ముందు ఎన్టీఆర్ అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించినా, భక్త పుండరీకునిగా ఇందులో ఆయన అభినయం అశేష ప్రేక్షకలోకాన్ని అలరించింది. ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం! ఎన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. పతాకంపై ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తన తమ్ముడు ఎన్.త్రివిక్రమరావు నిర్మాతగా తెరకెక్కించారు. 1957 నవంబర్ 28న విడుదలైన ‘పాండురంగ మహాత్మ్యం’ విజయఢంకా మోగించింది.…