Covid 19: ఇప్పుడున్న జనరేషన్ కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్ర కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది. అయితే, వైద్యం అభివృద్ధి చెందడంతో చాలా ఏళ్లుగా మహమ్మారి అనే పేరు వినిపించలేదు. అయితే, 2019లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్, కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. తొ
Baba Vanga: బాబా వంగా.. బల్గేరియాకు చెందిన మహిళ. అమె మరణించినప్పటికీ, ఆమె అంచనా వేసినట్లు భూమిపై కొన్ని సంఘటలు జరుగుతుండటంతో ఆమె జ్యోతిష్యానికి చాలా విలువ ఉంది. బాబా వంగా అసలు పేరు వాంజెలియ పాండేవా డిమిత్రోవా. ఆమె 12వ ఏట తుఫాను కారణంగా కంటి చూపును కోల్పోయింది.
The State of Happiness 2023: ఏదైనా చెబితే కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో.. ఎందుకంటే.. ఎంతో మందిని దూరం చేసింది.. తమకు కష్టసమయంలో అండగా ఉండేది ఎవరు? దూరం జరిగేది ఎవరు అనేది కూడా బయటపెట్టింది.. అయ్యో అంటూ ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా.. నా వాళ్లు అని చెప్పుకుని స్థితి కూడా లేకుండా చేసింది.. మొత్తంగా కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది.…
పరీక్షల్లో కాపీ కొట్టడం, మోసం చేయడం సమాజాన్ని, విద్యావ్యవస్థను నాశనం చేసే మహమ్మారి లాంటిదని, అన్యాయమైన మార్గాలను ఉపయోగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మరలా విరుచుకుపడుతున్నది. కరోనాకు భయపడి చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమాన సర్వీసులు నిలిపివేశాయి. జాతీయంగా షరతులతో కూడిన విమానాలను కొంతకాలం పాటు నడిపారు. రష్యాతో పాటుగా కొన్ని దేశాల్లో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలోని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. 18 నెలలుగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి పునరుద్దరించింది. రెండు డోసుల…
కరోనా కారణంగా ప్రపంచంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ లక్షలాదిమంది ప్రజలు కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా మృతి చెందారు. ఆరోగ్య పరగంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రజల ఆయుర్థాయం భారీగా తగ్గిపోతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల ఆయుర్ధాయం భారీగా తగ్గిందని, కోవిడ్ తరువాత రెండోసారి భారీగా ప్రజల ఆయుర్థాయం తగ్గిపోయినట్టు పరిశోధకుల సర్వేలో తేలింది. మొత్తం 29…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల…
ప్రపంచంలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడంలేదు. కొన్ని దేశాల్లో తగ్గినట్టు కనిపించినా తిరిగి కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త రకాల వేరియంట్లు పుట్టుకురావడంతో కరోనా మహమ్మారి కట్టడి సాధ్యం కావడంలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఏ దేశంలోనూ కరోనా ముగింపుకు రాలేదని, కొత్త వేరియంట్లు ప్రమాదకరమైన వేరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. బ్రిటన్‌లో జరిగిన యూరోకప్, దక్షిణ అమెరికాలో జరిగిన కొపా అమెరికా కప్ కారణంగా ఆయా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని,…