ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు.
AP MLC Election Results: మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా..…