UPI: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు డిజిటల్ గా మారబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది.
రాజస్థాన్ లోని ఆరు జిల్లాల్లో మూడు దశల్లో 1564 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయితీను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 598 పంచాయతీల్లో విజయం సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 490 పంచాయతీల్లో విజయం సాధించింది. ఆర్ఎల్‌పీ 39, బీఎస్పీ 10, ఎస్సీపీ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఇక ఇండిపెండెంట్లు 250 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో గ్రామస్థాయి నుంచి పట్టు ఉందని మరోసారి నిరూపించుకుంది.…
కరోనా వైరస్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూడగా… సెకండ్‌వేవ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సవాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా కరోనా విస్తరిస్తోండగా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…