సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘#SSMB29’ ఒకటి. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌లు ఎప్పుడొస్తాయా? ఎవరు ఎలాంటి విషయాలు పంచుకుంటారా? అని మహేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘సర్జమీన్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా #SSMB29 గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.…