సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘#SSMB29’ ఒకటి. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌లు ఎప్పుడొస్తాయా? ఎవరు ఎలాంటి విషయాలు పంచుకుంటారా? అని మహేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘సర్జమీన్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా #SSMB29 గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
Also Read : Allu Arha : అల్లు అర్హ రెండో సినిమా కన్‌ఫామ్..!
‘‘సినిమా కథల ఎంపిక విషయంలో నేనెప్పుడూ ముక్కుసూటిగా ఉంటా. ఏదైనా స్క్రిప్ట్ నాకు సరిపోతుందని అనిపిస్తే ఓకే చెబుతా. అలా చాలా కథలు నచ్చకా చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ, సినిమా తీసే విషయంలో దర్శకుడికి స్పష్టత ఉందా? లేదా? అనేది కూడా కచ్చితంగా చూస్తా. ఈ కారణంగానే #SSMB29 ఓకే చేశా. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. అదొక అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ సినిమాను విజువల్ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు’ అని పృథ్వీరాజ్ అన్నారు. మొత్తనికి రాజమౌళి స్టైల్‌కు తగ్గట్టుగా, ఈ సినిమా కూడా ఓ పాన్-వరల్డ్ అడ్వెంచర్ సినిమాగా రూపొందుతోంది.