చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా…
Allu Arjun – Atlee : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హిట్‌మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘AA22’ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ నటనా సత్తాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా, అల్లు అర్జున్ ఈ…
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ…
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్…
యంగ్ రెబల్ స్టార్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.. ఏంటీ నిజమా..? అమ్మాయి ఎవరు..? అని కంగారుపడకండి.. ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే కొత్త ఇంటిని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కోట్లు అర్జిస్తున్న ప్రభాస్ హైదరాబాద్ లో తన కలల సౌధాన్ని నిర్మించాలని చూస్తున్నాడట. ఇప్పటికే ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్న ప్రభాస్.. హైదరాబాద్ లో కూడా ఒక విలాసవంతమైన విల్లాను కట్టించనున్నాడట.. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్…
‘చలో’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. టాలీవుడ్‌లో చాలా తక్కువ వ్యవధిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 25 ఏళ్ల ఈ నటి స్టార్ హీరో చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను పొందుతూ సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఇక విషయానికొస్తే ఇటీవలే రష్మిక తన డేటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో…