Crime News: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువలో ఒక ప్రేమజంట దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాచర్ల పట్టణానికి చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సాగర్ కుడి కాలువ వద్ద ఉన్న బొంబాయి కంపెనీ వంతెనపై నుంచి ఇద్దరూ కాలువలోకి దూకి…
పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా తనను, తన అనుచరులను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అన్యాయమని, ఇది చట్టవ్యవస్థను అవమానించే పని అని ఆమె మండిపడ్డారు.
YCP Ex-MLA Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గోపిరెడ్డితో పాటూ మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Palnadu: భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలను రోడ్డున పడేశాయి.. బరితెగించిన తల్లి ప్రియుడి కోసం పిల్లలను వదిలేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా... చరవాణిలో పరిచయమైన వ్యక్తి కోసం.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను వదిలేసింది ఓ తల్లి. పిల్లల కోసమైనా.. తిరిగి వెళ్లాలని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ససేమీర అంటోంది. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తతో తరుచూ గొడవ…
144 Section in Palnadu: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్…
Degree student commits suicide in Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆన్ లైన్ రుణ వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా కృంగిపోయిన ఆ విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ గత ఏడాది ఆన్ లైన్‌లో రుణం తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ…